సంధ్య థియేటర్ ఘటనలో గాయపడి శ్రీతేజ్ చికిత్స పొందుతున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తండ్రి అరవింద్ పరామర్శించారు. బుధవారం అరవింద్ కిమ్స్ ఆస్పత్రికి వెళ్లి.. బాలుడి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. శ్రీతేజ్ తల్లి రేవతి మృతిపై అరవింద్ ఆవేదన వ్యక్తం చేసారు. బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. కేసు కోర్టులో ఉన్నందున అల్లు అర్జున్ ఆస్పత్రికి రాలేకపోయారని తెలిపారు.










