హైదరాబాద్లో లైంగిక వేధింపుల కేసులో యూట్యూబర్ ప్రసాద్ బెహరాను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ వెబ్ సిరీస్ యాక్టర్ ఈ మేరకు ఫిర్యాదు చేయడం ద్వారా విషయం వెలుగులోకి వచ్చింది. ఆమె ప్రకారం, కొన్ని నెలలుగా ప్రసాద్ బెహరా ఆమెను లైంగికంగా వేధించేవాడని, షూటింగ్ సమయంలో అతడు ఆమె ప్రైవేట్ భాగాలను తాకేవాడని తెలిపింది. ఈ పిర్యాదుపై పోలీసులు విచారణ జరిపి, ప్రసాద్ బెహరాను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
