మంచు ఫ్యామిలీలో వివాదం మరింత ముదురుతోంది. మంచు మనోజ్ ఫిర్యాదుకు వ్యతిరేకంగా ఆయన తల్లి నిర్మల స్పందించారు. పహాడీ షరీఫ్ సీఐకి లేఖ రాసిన ఆమె, తన కుమారుడు చెబుతున్న విషయాలు అబద్ధమని స్పష్టం చేశారు. తన పుట్టినరోజు సందర్భంగా విష్ణు కేక్ తీసుకుని వచ్చాడని, ఎలాంటి దౌర్జన్యం జరగలేదని నిర్మల వివరించారు. ఇంట్లో పనివాళ్లు వదిలివెళ్లడానికి విష్ణు కారణం కాదని ఆమె స్పష్టం చేశారు. మంచు ఫ్యామిలీకి చెందిన ఈ వివాదం ఇప్పుడు మరింత చర్చనీయాంశమైంది.
