హీరోయిన్ అనుష్క శెట్టి నటిస్తున్న ఘాటి మూవీ రిలీజ్ డేట్ ఫిక్సయింది. 2025 ఏప్రిల్ 18న విడుదల చేయనున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు మూవీ పోస్టర్‌ను విడుదల చేశారు. సోషల్ డ్రామా నేపథ్యంలో వస్తున్న ఈ మూవీకి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది.
