తన మేనమామ, నటుడు చిరంజీవిని అల్లు అర్జున్ కలిశారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం మధ్యాహ్నం చిరంజీవి నివాసానికి బన్నీ వెళ్లారు. చిరు కుటుంబంతో సుమారు గంటపాటు సమయం గడిపారు. సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో జైలు నుంచి విడుదలైన తర్వాత తొలిసారి చిరంజీవిని బన్నీ కలుసుకున్నారు. తాజా పరిణామాలపై చర్చించుకున్నట్లు సమాచారం.
