సోమవారం నుంచి జరగనున్న గ్రూప్ 2 (Group 2) పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు టీజీపీఎస్సీ ఛైర్మన్ బుర్రా వెంకటేశం తెలిపారు. పది రోజులుగా అన్ని అంశాలను సమీక్షించామని ఆయన చెప్పారు. పరీక్షలు సీసీ కెమెరాల పర్యవేక్షణలో జరుగుతాయని, అభ్యర్థులు పబ్లిక్ సర్వీస్ కమిషన్‌పై నమ్మకంతో పరీక్షలు రాయాలని ఆయన సూచించారు.










