పుష్ప2′ సినిమా సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటలో మహిళా అభిమాని మృతి కేసులో బన్నీని అరెస్ట్ చేశారు. అయితే ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం నాంపల్లి కోర్టు అల్లు అర్జున్ కు 14 రోజులు రిమాండ్ విధించింది. కాసేపట్లో అల్లు అర్జున్ ను చంచలగూడా జైలుకు పోలీసులు తరలించ నున్నారు.
అల్లు అర్జున్ కేసులో కీలక మలుపు..
సినీ నటుడు అల్లు అర్జున్‌పై నమోదైన కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. అల్లు అర్జున్ అరెస్టుపై సంధ్య ధియేటర్ తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన రేవతి భర్త భాస్కర్ స్పందించారు. ఈ కేసును విత్ డ్రా చేసుకుంటానని.. అల్లు అర్జున్ను విడుదల చేయాలని కోరారు. ఈ ఘటనతో ఆయనకు సంబంధం లేదని పేర్కొన్నాడు.