రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది. ఆర్బీఐ గవర్నర్కు ఈమెయిల్ బాంబు బెదిరింపు లేఖ వచ్చింది. రష్యన్ భాషలో దుండగులు బెదిరింపులకు పాల్పడ్డారు. ఆర్బీఐని పేల్చేస్తామంటూ లేఖలో పేర్కొన్నారు. కాగా గతేడాది కూడా న్యూ ఇయర్ కు ముందు ఇలాగే ఆర్బీఐకి బాంబు బెదిరింపు రావడం గమనార్హం.
