షూటింగ్ కోసం భీమవరం వచ్చిన జగపతిబాబుకు హీరో ప్రభాస్ రాచ మర్యాదలు చేశారు. అందులో భాగంగా జగపతిబాబుకు ప్రభాస్ భోజనం పంపించారు. ఈ ఫుడ్ ట్రీట్ ను ఆస్వాదించిన జగపతిబాబు బకాసురుడిలా తిని కుంభకర్ణుడిలా నిద్రపోయానని ఒక వీడియోలోపేర్కొన్నారు. సినిమా సెట్టులో కూడా ప్రభాస్ తన తోటి వారికి ఇంటి భోజనం రుచి చూపిస్తారని సంగతి తెలిసిందే.
