మంచు ఫ్యామిలీలో వివాదం ముదురుతోంది. తనపై దాడి చేసిన వారి వివరాలను హైదరాబాద్ లోని పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన కాసేపటికే తన కొడుకు మంచు మనోజ్ పై మోహన్ బాబు పోలీసులకు ఫిర్యాదు చేసారు. ఈ మేరకు రాచకొండ సీపీకి లేఖ రాసారు. మనోజ్ తో పాటు తన కోడలు మౌనిక నుంచి తనకు ముప్పు ఉందని లేఖ రాసారు.
