పవన్ కళ్యాణ్ కు సంబంధించి అతని పేషీకి బెదిరింపు కాల్స్ రావడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇందులో భాగంగానే పవన్ను ఉద్దేశించి ఆగంతకుడు అభ్యంతరకర భాష, వార్నింగ్ ఇస్తూ మెసేజులు కూడా పంపించినట్లుగా తెలుస్తోంది. కాగా పవన్ సూచన మేరకు బెదిరింపు కాల్స్ విషయాన్ని పోలీసు ఉన్నతాధికారులకు తెలియచేశారు.
