స్టాక్ మార్కెట్లు ఈరోజు స్వల్ప నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 57 పాయింట్ల నష్టంతో 81709 వద్ద ముగిసింది. నిఫ్టీ 30 పాయింట్ల నష్టంతో 24677 దగ్గర ముగిసింది. ఆర్బీఐ పరపతి విధాన సమీక్ష నిర్ణయాలు మదుపర్లను మెప్పించకపోవడంతో వరుసగా ఐదు రోజుల లాభాలకు బ్రేక్ పడింది.










