సీఎం నారా చంద్రబాబు నాయుడుని గూగుల్ క్లౌడ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్, కంట్రీ ఎండీ బిక్రమ్ సింగ్ బేడీ ఉండవల్లి నివాసంలో గురువారం కలిశారు. ఎఐలో రాష్ట్ర ప్రభుత్వం, గూగుల్ సంస్థ మధ్య మంత్రి నారా లోకేష్ సమక్షంలో జరిగిన ఒప్పందానికి ముందు గూగుల్ ప్రతినిధులు సీఎంను కలిశారు. గూగుల్, రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఒప్పందం ఒక గొప్ప ముందడుగని సీఎం చంద్రబాబు అన్నారు.
