గుడివాడ వైఎస్సార్‌సీపీ మాజీమంత్రి కొడాలి నాని అనుచరులను పోలీసులు వరుస అరెస్టులు చేస్తున్నారు. అధికారంలో ఉండగా చేసినా అరాచకాలపై పోలీసులు చర్యలు చేపట్టారు. 9 మంది వైఎస్సార్‌సీపీ యువ నేతలను అరెస్టు చేసిన గుడివాడ 1 టౌన్ పోలీసులు.. పెదపారుపూడి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. 2022 డిసెంబర్ 25న టీడీపీ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు వస్త్ర దుకాణంపై కొడాలి నాని అనుచరులు పెట్రోల్ ప్యాకెట్లతో దాడి చేసి అరాచకం సృష్టించారు. అప్పుడు జరిగిన ఈ ఘటనపై పోలీసులు ఇప్పుడు చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో అరెస్టు చేసిన నేతలపై 143, 144, 145, 188, 427, 506, రెడ్ విత్ 149 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
