ఈ నంబర్ల నుంచి ఫోన్ వస్తే జాగ్రత్త

హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అపరిచిత నంబర్ల నుంచి వచ్చే ఫోన్ కాల్స్‌పై ప్రజలను అప్రమత్తం చేశారు. మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో, కొన్ని అంతర్జాతీయ నంబర్ల ద్వారా సైబర్ మోసాలు జరుగుతున్నాయని హెచ్చరించారు.

ప్రధానంగా +94777 455913, +37127913091, +56322553736, +37052529259, +255901130460 వంటి నంబర్ల నుంచి ఫోన్ వస్తే ఎత్తరాదని సూచించారు.

ఈ నంబర్లు +371 (లాత్వియా), +375 (బెలారస్‌), +381 (సెర్బియా), +563 (లోవా), +370 (లిథువేనియా), +255 (టాంజానియా) వంటి కోడ్‌లతో మొదలవుతాయి. ఈ నంబర్లు కేవలం ఒకసారి రింగ్ చేసి, కట్ చేస్తాయి. తిరిగి ఫోన్ చేస్తే, మీ మొబైల్ డేటా, కాంటాక్ట్‌ల జాబితా, బ్యాంకింగ్ మరియు క్రెడిట్ కార్డు వివరాలు కేవలం మూడు సెకన్లలో కాపీ చేసుకునే ప్రమాదం ఉందని పోలీసులు హెచ్చరించారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News