కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకా లు పేదలకు వరమని సనత్ నగర్ MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంగళవారం వెస్ట్ మారేడ్ పల్లి లోని MLA క్యాంప్ కార్యాలయంలో బేగంపేట డివిజన్ కు చెందిన 11 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మీ (9), షాదీముబారక్ (2) ల క్రింద మంజూరైన చెక్కులను చెక్కులను పంపిణీ పంపిణీ చేసి మాట్లాడారు. పేదింటి ఆడబిడ్డల కుటుంబాల్లో వెలుగులు నింపాలని ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ టి.మహేశ్వరి, డివిజన్ BRS అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, నాయకులు శ్రీహరి, శేఖర్, ఆరీఫ్ తదితరులు ఉన్నారు.










