ఏటూరు నాగారంలో మావోయిస్టుల ఎన్‌కౌంటర్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది ఫేక్ ఎన్‌కౌంటర్ అని.. ఎన్‌కౌంటర్ ఎప్పటికైనా తప్పే అని ఈ ఎన్‌కౌంటర్‌పై మాకు అనుమానాలు ఉన్నాయని, దానిపై కోర్టులో వేశామని తెలిపారు.. ఆదివాసి హక్కుల సంఘాలకు సంబంధించిన మిత్రులు మాకు రిప్రజెంటేషన్ ఇచ్చారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి వివరించారు. ఎట్టి పరిస్థితిలో ఎన్‌కౌంటర్ ఫేక్ అయితే మాత్రం తప్పకుండా అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.










