ఆరోగ్య ఉత్సవాలకు సీఎం రేవంత్ శ్రీకారం చుట్టారు. వైద్యారోగ్య, కుంటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో.. ఆరోగ్య ఉత్సవాలను ప్రారంభించారు. ఎన్టీఆర్ మార్గ్‌లోని HMDA గ్రౌండ్స్‌లో జరిగే ఈ కార్యక్రమంలో.. 213 నూతన అంబులెన్సులను రేవంత్ జెండా ఊపి ప్రారంభించారు. 108 కోసం 136 అంబులెన్స్‌లను, 102 కోసం 77 అంబులెన్సులను కేటాయించనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి దామోదర రాజనర్సింహ, మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు.










