రాజమండ్రి నుంచి ప్రధాన నగరాలకు నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం అయ్యాయి. తాజాగా ఇక్కడి నుంచి ముంబయికి ఎయిర్ బస్ స్టార్ట్ అయ్యింది. అటు రేణిగుంట – ముంబయి మధ్య కూడా డైరెక్ట్ ఫ్లైట్ ప్రారంభం అయ్యింది. దీనిపై ఏపీ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎయిర్ బస్సు సర్వీసుతో రాజమహేంద్రవరం, ముంబైకి మధ్య దూరం తగ్గింది.. కేవలం 2 గంటల్లోనే ముంబై వెళ్లిపోవచ్చు. ఈ నెల 12 నుంచి న్యూఢిల్లీకి ఇక్కడ నుంచి విమాన సర్వీసు ప్రారంభమవుతుంది.










