ఒకప్పటి శృంగార తార సిల్క్ స్మిత జీవితం పై బయోపిక్ రెడీ అవుతుంది. స్మిత పాత్రలో చంద్రికా రవి అనే అమ్మాయి నటిస్తున్నారు. “సిల్క్ స్మిత ది క్వీన్ ఆఫ్ సౌత్” సినిమా సంబంధించిన గ్లింప్స్ ను మేకర్స్ విడుదల చేశారు. 1989, 90 దశకాల్లో భారత సినీ పరిశ్రమను శాసించిన, ఆమెలోని వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించేలా మూవీ ఉంటుందని డైరెక్టర్ జయరామ్ తెలిపారు. ఈ సినిమాను అన్ని భాషల్లో ఒకేసారి రిలీజ్ చేస్తామని చెప్పారు. ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ యూట్యూబ్లో అందుబాటులో ఉంది.
