సివిల్ అసిస్టెంట్ సర్జన్ల ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. సోమవారం నాడు ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించి నోటిపికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ పరిధిలో మొత్తం 280 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీ చేయనున్నారు. బ్యాక్లాగ్, రెగ్యులర్ పోస్టులను.. పీహెచ్సీలు/ఇతర వైద్య సంస్థల్లో రెగ్యులర్ ప్రాతిపదికన నియామకం చేపట్టనుంది ప్రభుత్వం. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.
